తిరుపతి ఎయిర్‌పోర్టులో హై అలర్ట్

తిరుపతి ఎయిర్‌పోర్టులో హై అలర్ట్

TPT: తిరుపతి ఎయిర్‌పోర్టులో హై అలెర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా భారత్- పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఎయిర్పోర్టు అధికారులతో ఎస్పీ హర్షవర్ధన్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ క్రమంలో ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆయన సూచించారు. అనంతరం లగేజీని డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.