'త్వరలో విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు'
VSP: త్వరలో విశాఖ కేంద్రంగా దక్షిణ మధ్య తీర రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే కార్యకలాపాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని చెప్పారు. పూర్తిస్థాయి భవనం సిద్ధమయ్యే వరకు, తాత్కాలికంగా వీఎంఆర్డీఏ ‘ది డెక్’ భవనం నుంచి పాలన సాగనుందన్నారు.