కార్డెన్ సెర్చ్... 124 వాహనాలు స్వాధీనం
NRML: నేరాల నియంత్రణకే కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు బైంసా రూరల్ సీఐ నైలు తెలిపారు. గురువారం ఉదయం కుబీర్ మండలం నిగ్వ గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 120 బైకులు, 4ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, సైబర్ మోసాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. దుర్గా నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.