ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పార్క్ సెంటర్ వద్ద టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న రోగులకు బెడ్లను పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.