'సేవాలాల్ జయంతికి సెలవు ప్రకటించాలి'

'సేవాలాల్ జయంతికి సెలవు ప్రకటించాలి'

SRD: బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం బాల బ్రహ్మచారి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పోస్ట్ కార్డులు పంపి తమ అభ్యర్థనను తెలియజేశారు. దేశవ్యాప్తంగా బంజారా గిరిజనులు ఒకే భాష, వేషం, సంస్కృతి, సంప్రదాయాలతో ఐక్యంగా ఉన్నారని పేర్కొన్నారు.