మల్లికార్జున హత్య కేసులో 7 మంది అరెస్ట్
KRNL: ఈర్లదిన్నె గ్రామ సమీపంలో ఉగాది ముందు జరిగిన హత్యకేసులో 7 నిందితులను సీ.బెళగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. మల్లికార్జునను సొట్ట నాగన్న తన కుమారులతో కలిసి వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి 7 మందిని అరెస్ట్ చేసి, రెండు మోటార్ సైకిళ్లు, వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.