రైతుబీమా పథకాన్ని నిర్వీర్యం చేశారు: హరీష్ రావు

TG: రైతుబీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 3 నెలలుగా రైతుబీమా ప్రీమియం చెల్లించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రైతు కుటుంబాలకు శాపంగా మారుతోందని అసహనం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో రైతుబీమా పథకం కొనసాగుతుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. రైతు కుటుంబాలకు ప్రభుత్వమే రూ.5లక్షల బీమా చెల్లించాలని డిమాండ్ చేశారు.