అకాల వర్షంతో తడిసి ముద్దైన ధాన్యం

అకాల వర్షంతో తడిసి ముద్దైన ధాన్యం

MNCL: జన్నారం మండలంలో కురిసిన అకాల వర్షంతో వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆదివారం రాత్రి జన్నారం పట్టణంతో పాటు పలు గ్రామాలలో ఒక్కసారిగా భారీ వర్షం పడింది. జన్నారం మార్కెట్ కమిటీ ఆవరణతో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద ఎండకు ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయి పనికిరాకుండా పోయిందని రైతులు వాపోయారు.