'నారాయణపురాన్ని ఆదోని మండలంలోనే కొనసాగించాలి'

'నారాయణపురాన్ని ఆదోని మండలంలోనే కొనసాగించాలి'

కర్నూలు: నారాయణపురం గ్రామాన్ని ఆదోని మండలంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు మంగళవారం కర్నూలు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆదోనికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాన్ని 35 కి.మీ దూరంలోని పెద్ద హరివనం మండలంలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. గ్రామ ప్రజల రోజువారీ పనులన్నీ ఆదోనితోనే ముడిపడి ఉన్నాయని తెలిపారు.