వేసవి క్రీడా శిక్షణ తరగతులకు దరఖాస్తులు ఆహ్వానం

SRPT: జిల్లాలో 14 సంవత్సరాలలోపు బాల బాలికలకు ఉచిత వేసవి క్రీడల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రామచంద్రరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 01 నుండి జూన్ 06 వరకు బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, వాలీబాల్ క్రీడలనందు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.