మొక్కజొన్న ధాన్యాన్ని పరిశీలిస్తున్న ఎంసీపీయూ నేతలు
WGL: నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆదివారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి తడిసిన మొక్కజొన్న ధాన్యాన్ని ఎంసీపీయూ పార్టీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దాపురం రమేష్ మాట్లాడుతూ.. అకాల వర్షం కారణంగా మార్కెట్లో తడిసిన మొక్కజొన్నకు ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.