వ్యక్తిని చంపేందుకు హత్యాయత్నం

ప్రకాశం: ఈనెల 11వ తేదీన మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బాపిరెడ్డి అనే వ్యక్తిపై వెంగల్ రెడ్డి అనే వ్యక్తి కంట్లో కారం కొట్టి హత్య చేసేందుకు యత్నించాడు. బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలిస్తున్నామని మార్కాపురంలో డీఎస్పీ నాగరాజు తెలిపారు. గతంలో వెంగల్ రెడ్డి కొడుకు కొండారెడ్డిని బాపిరెడ్డి హత్య చేశాడని డీఎస్పీ అన్నారు.