డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి: కార్పొరేటర్

RR: వనస్థలిపురం డివిజన్‌లోని నాగార్జున కాలనీలో కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి పర్యటించారు. వారు మాట్లాడుతూ.. అధిక వర్షాలు పడుతున్న కారణంగా ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. వర్షపు నీరు రోడ్డు మీద నిలవకుండా చర్యలు చేపట్టాలన్నారు. కాలనీవాసుల సమస్యలన్నిటిని తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.