ఈ రోడ్డును బాగు చెయ్యండి మహా ప్రభో..!

ఈ రోడ్డును బాగు చెయ్యండి  మహా ప్రభో..!

PPM: గరుగుబిల్లి మండలంలోని సన్యాసిరాజుపేట, రాయం దొరవలస ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు దారంతా బురదగా మారింది. దీంతో వాహనాలు కూరుకుపోతున్నాయి. స్థానికులు, చోదకులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. ఇబ్బందులతో ప్రయాణాలు సాగి స్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు బాగు చేయాలని కోరుతున్నారు.