వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి
ASR: వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి మృతి చెందింది. హుకుంపేట (M) గడికించుమండకు చెందిన బంగురు రమేశ్, సుమలత కుమారుడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ.. ఆక్సిజన్ పరికరాలు సరిగా లేకపోవడంతో VSP కేజీహెచ్‌కు తరలించాలని డాక్టర్ సూచించారు. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా సిబ్బంది స్పందించలేదు. దీంతో పసికందు మృతి చెందింది.