పేద ప్రజలకు CMRF వరం: ఎమ్మెల్యే
E.G: చాగల్లు మండలం నెలటూరు గ్రామానికి చెందిన వసంతవాడ సోమశేఖరాచార్యులకి CMRF ద్వారా మంజూరైన రూ.1,56,294 విలువ గల చెక్కును కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు చేతుల మీదుగా శనివారం అందజేశారు. CMRF పేదలకు వరమని, పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.