నర్సీపట్నంలో వృథాగా పోతున్న తాగునీరు

నర్సీపట్నంలో వృథాగా పోతున్న తాగునీరు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వద్ద తాగునీరు శుక్రవారం వృథాగా పోతుంది. ఇక్కడ గల మంచినీటి పైపులైను మరమ్మత్తులకు గురవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉదయం నుంచి భారీగా నీరు కాలువల్లోకి పోతుంది. తక్షణమే మున్సిపల్ నీటి విభాగం అధికారులు స్పందించి ఈ పైపు లైన్‌కు మరమ్మత్తులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.