స్కృబ్ టైఫస్‌తో వృద్ధురాలు మృతి

స్కృబ్ టైఫస్‌తో వృద్ధురాలు మృతి

GNTR: జిల్లాలో స్కృబ్ టైఫస్‌తో మరణాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వృద్ధురాలు స్కృబ్ టైఫస్‌తో మృతి చెందింది. ఈ వ్యాధితో GGHలో చేరగా, చికిత్స పొందుతూ.. ఇవాళ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, మృతురాలు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వాసి ధనమ్మగా గుర్తించారు. అయితే, జిల్లా వ్యాప్తంగా స్కృబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.