రేపు జిల్లాలో అన్ని వైన్స్ దుకాణాలు బంద్

NRPT: హనుమాన్ జయంతి పురస్కరించుకొని శనివారం జిల్లాలోని అన్ని వైన్స్ దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, పర్మిట్ రూమ్ లను మూసి వేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.