ఉద్యోగం పేరుతో మోసం.. నిందితుడికి రిమాండ్
ADB: యోగ టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతి వద్ద రూ. 20 వేలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేశారు. చించోలి గ్రామానికి చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో దుర్వగూడకు చెందిన దుర్వా పరమేశ్వర్ రావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ బండారి రాజు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.