బస్సు ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిన HRC
HYD: చేవెళ్ల బస్సు ప్రమాదాన్ని సుమోటోగా రాష్ట్ర HRC స్వీకరించింది. డిసెంబర్ 15లోపు నివేదిక సమర్పించాలని, రవాణా శాఖ, హోం శాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారిని నివేదిక పంపాలని హెచ్ఆర్సీ కోరింది. మరో వైపు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ని, ఆర్టీసీ ఎండీని నివేదిక పంపాలని ఆదేశించింది.