కనకదాస జయంతి వేడుకల్లో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షురాలు
సత్యసాయి: హిందూపురం మండలం మోతుకపల్లిలో జరిగిన శ్రీశ్రీశ్రీ భక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కురుబ దీపిక, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కురుబ సోదర సోదరీమణులకు జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జ్యోతులు మోస్తూ, గోరవయ్యల నృత్యాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.