కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు
NGKL: అమ్రాబాద్ మండలంలోని వెంకటేశ్వర్ల బావి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుపోతుల రఘుపతి, బాలస్వామి గురువారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కటకం శ్రీనివాస చారి, బాలునారి, తదితరులు పాల్గొన్నారు.