VIDEO: వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న MLA

ADB: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతిష్టించిన వినాయకుడి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే దంపతులు లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని గణనాథుని వేడుకున్నట్లు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు.