పదిలో శతశాతం ఫలితాలను సాధించాలి: కలెక్టర్
VZM: పదో తరగతిలో శతశాతం ఫలితాలను సాధించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. స్థానిక వీటీ అగ్రహారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి బోధన గురించి తెలుసుకున్నారు. పదో తరగతిలో అందరూ ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.