రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
PKSM: ఒంగోలు నుంచి ద్విచక్ర వాహనంపై ఉలవపాడు వెళ్తున్న యువకుడు జరుగుమల్లి మండలం జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి పాలేటి బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి కింద పడ్డాడు. అతనికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. హైవే అంబులెన్స్ 1033లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. గాయపడ్డ వ్యక్తి ఉలవపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన సురేష్ అని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.