వాడపల్లి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
కోనసీమ తిరుమలగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రహదారులను నిర్మిస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధర్ రావు పేర్కొన్నారు. మంగళవారం ఆలయంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆలయ ఛైర్మన్ వెంకటరాజుతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.