నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
W.G: కొనితివాడలోని 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు భీమవరం నుంచి కొత్త విద్యుత్ లైన్ వేసే పనుల నిమిత్తం బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ట్రాన్స్ కో ఏఈ ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనితివాడ, మడుగుపోలవరం, అండలూరుతో పాటు పారిశ్రామిక ఫీడర్ల పరిధిలో విద్యుత్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.