'విద్యార్థినిలకు నాణ్యమైన ఆహారం అందించాలి'

KMM: మధిరలోని బాలికల వసతి గృహాన్ని శనివారం మండల తహసీల్దార్ రాంబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ విద్యార్థినీలతో కలిసి భోజనం చేశారు. వసతి గృహం పరిసరాలు శుభ్రంగా ఉండాలని, విద్యార్థినిలకు నాణ్యమైన ఆహారం అందించాలని హాస్టల్ వార్డెన్ ను సూచించారు.