'బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు'
RR: చేవెళ్ల నియోజకవర్గంలో బీసీ సేన సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ బీసీ సేన అధ్యక్షులు బర్క కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో చేవెళ్ల నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్‌ను నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలను రాజకీయంగా ఎదగకుండా కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుపడుతున్నాయని, బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు.