బస్కీలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

బస్కీలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

ASR: అరకు లోయ మండలం బస్కీ పంచాయతీలో బీటీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ పాడి రమేశ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు పంచాయతీ ప్రజలు, అడవి తల్లి బాటలో భాగంగా బస్కీ పంచాయతీ నుండి కితలంగి పంచాయతీ పరేశిల వరకు రోడ్డు మంజూరు చేయడాన్ని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ ఎంవీ నారాయణ, పెసా కార్యదర్శి స్వాభీ పొత్తి పాల్గొన్నారు.