VIDEO: వెల్లటూరులో ఉచిత కంటి వైద్య శిబిరం
BPT: భట్టిప్రోలు మండలం వెల్లటూరులో శుక్రవారం ఉచిత కంటి, ముత్యబిందు ఆపరేషన్ శిబిరం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రారంభించారు. శంకర నేత్రాలయ వైద్యులు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఈ శిబిరం ఏప్రిల్ 9 వరకు కొనసాగుతుంది. గ్రామాల్లోనే పేదలకు మెరుగైన వైద్యం అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.