తేలప్రోలులో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం

తేలప్రోలులో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం

కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఓ కళాశాల NSS యూనిట్ విద్యార్థులు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గ్రామస్తులకు ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య కార్డు పొందే విధానం, ఆరోగ్య భీమా ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. పోస్టర్లు పంపిణీ చేసి ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో NSS అధికారి డాక్టర్ వీ.శ్రీహరి బాబు, తదితరులు పాల్గొన్నారు.