ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

VZM: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.10 లక్షల చెక్కును రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం గజపతినగరంలోని టీడీపీ కార్యాలయంలో బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామానికి చెందిన పడాల అప్పలనాయుడుకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పడాల అరుణ, చప్ప చంద్రశేఖర్, గోపాలరాజు జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.