రేపు ఎయిమ్స్‌లో OP సేవలు బంద్

రేపు ఎయిమ్స్‌లో OP సేవలు బంద్

GNTR: మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో రేపు OP సేవలు నిలిచిపోనున్నాయి. గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎమర్జెన్సీ సేవలు మాత్రం యథావిధిగా అందుబాటులో ఉంటాయని, దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఈ మార్పును గమనించాలని అధికారులు కోరారు. కాగా, నిత్యం రోగులతో రద్దీగా ఉండే ఆసుపత్రుల్లో వైద్య సేవలకు సెలవు ప్రకటించడమేమిటని ప్రజలు విమర్శిస్తున్నారు.