రోడ్డు ప్రమాదంలో యువకునికి గాయాలు

ELR: ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గొల్లగూడెం వద్ద సోమవారం జరిగిన ప్రమాదంలో చొప్పరమెట్లకు చెందిన పామర్తి పవన్ కుమార్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ద్విచక్ర వాహనంపై వస్తున్న పవన్ కుమార్‌ను 308 బస్సు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు క్షతగాత్రున్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన సంచలనంగా మారింది.