చెరువును తలపిస్తున్న పాఠశాల

చెరువును తలపిస్తున్న పాఠశాల

అల్లూరి: జి.మాడుగుల: మండల కేంద్రం గాంధీనగరంలో నేషనల్ హైవే పనుల జాప్యంతో ఎం.పీ. మోడల్ ప్రాథమిక పాఠశాల జలమయమైంది. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు స్కూల్ ఆవరణలోకి భారీగా నీరు చేరి, మోకాళ్ల లోతు బురద నెలకొంది. అధికారుల నిర్లక్ష్యంతో పసిపిల్లలు బడికి వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.