పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు
KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామం రోడ్డు నెంబర్-13లో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఇలా పగటిపూట వీధి దీపాలు వెలిగితే విద్యుత్తు దీపాలు పాడవుతాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని వీధుల్లో మాత్రం విద్యుత్ దీపాలు వెలగక చీకటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.