సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజా దర్బార్: ఎమ్మెల్యే
ASR: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే 'ప్రజా దర్బార్' అని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. శుక్రవారం ఆమె పాడేరుల క్యాంపు కార్యాలయంలో అర్జీలు స్వీకరించారు. తాగునీరు, పెన్షన్లు, డ్రైనేజీ సమస్యలపై వచ్చిన వినతుల్లో కొన్నింటిని అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి అధికారులకు సిఫారసు చేశామన్నారు.