మంచినీటి సరఫరాపై ఆరా

HYD: మంచినీటి సరఫరాపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని మల్లేపల్లి డివిజన్ కార్పొరేటర్ జాఫర్ ఖాన్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని అగపురాలో కార్పొరేటర్ జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ మంచినీటి సరఫరాపై వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడైనా కలుషిత నీరు సరఫరా అయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.