షార్ట్ సర్క్యూట్.. పేలిన గ్యాస్ సిలిండర్
AP: తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ పూరి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది వచ్చేలోపే, ఇంట్లోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. అదృష్టవశాత్తూ సిబ్బంది ఇంటి బయటే ఉండటం వలన ప్రాణాపాయం తప్పింది. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.