VIDEO: సీతారాముల కల్యాణానికి కోటి గోటి తలంబ్రాలు అందజేత
KNR: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవానికి కోటి గోటి తలంబ్రాలు సమర్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌కు చెందిన శ్రీరామదాసు భక్త మండలి భక్తిశ్రద్ధలతో సేంద్రియంగా పండించిన వరి ధాన్యంతో తలంబ్రాలు సిద్ధం చేసి అందజేశారు. గత పదేళ్లుగా భద్రాచలం, ఇల్లందకుంట దేవాలయాలకు తలంబ్రాలు సమర్పిస్తున్నారు.