VIDEO: కౌలాస్ ఎల్లమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

VIDEO: కౌలాస్ ఎల్లమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

KMR: జుక్కల్ మండలం కౌలాస్ ఎల్లమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సెలవు దినం కావడంతో ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్షేత్రానికి తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలిరావడం విశేషం.