ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి
MLG: ఎటునాగారం మండల పరిధిలో చింతలపాడు బుట్టారంలో ఇవాళ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి గుండ్ల శ్రీలత దేవేందర్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క కార్ల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. గ్రామ ప్రజలు అందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.