VIDEO: పాల వ్యాన్ లో మంటలు.. తప్పిన ప్రమాదం

VIDEO: పాల వ్యాన్ లో మంటలు.. తప్పిన ప్రమాదం

KMM: పెనుబల్లి మండల కేంద్రంలో పాలు తరలిస్తున్న ఒక వ్యాన్‌లో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. వ్యాన్ బ్రేక్ డ్రమ్స్ పట్టేయడం కారణంగా వెనుక చక్రాల వద్ద మంటలు చెలరేగి, దట్టమైన పొగలతో వ్యాన్ కొంత భాగం కాలిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే బయటికి దూకేసి సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సహాయంతో బకెట్లతో నీళ్లు తెచ్చి మంటలను ఆర్పేశారు.