రీపోలింగ్ కోసం పోరాటం చేస్తాం: ఎంపీ

KDP: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై రేపే హైకోర్టుకు వెళ్తామని కడప ఎంపీ అవినాష్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఇవాళ జరిగిన ఎన్నికను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తల కన్నా పోలీసులు బాగా కష్టపడ్డారు. కేంద్ర బలగాల సమక్షంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. రీపోలింగ్ జరిగేలా వైసీపీ పోరాటం చేస్తుంది. ఎవరూ అధైర్యపడకండి' అని అన్నారు.