ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హన్వాడ మండలం బుద్దారంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.