వందే భారత్ స్లీపర్.. విమానాన్ని మించిన లగ్జరీ!

వందే భారత్ స్లీపర్.. విమానాన్ని మించిన లగ్జరీ!

వందే భారత్ స్లీపర్ రైలుతో ప్రయాణం ఇక నెక్స్ట్ లెవల్ ఉండబోతుంది. ఇందులో విమానం తరహా సౌకర్యాలు ఉంటాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దీని ఇంటీరియర్, లగ్జరీ చూస్తే.. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కూడా దిగదుడుపేనట. ఇందులో ప్రయాణించే సామాన్యుడికి కూడా రాజభోగం దక్కనుందన్నమాట. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ రైలు భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చేస్తుందని అంటున్నారు.