'చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం ఒక్కటే కాదు'
HYD: చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం ఒక్కటే కాదని, దాని అవసరాలు నెరవేరే విధంగా వాటిని తీర్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఇవాళ శిల్పకళా వేదికలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం నిర్వహించిన సౌత్ ఇండియా CSR సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CSR నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా ఆయా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.