కాంగ్రెస్ లో భారీగా చేరికలు
ADB: నేరడిగొండ మండలంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గం ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ పర్యటించారు. ఈ సందర్బంగా బజార్‌హత్నూర్ మండలంలోని బలాంపూర్ గ్రామస్థులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అందరు కలిసి కట్టుగా పనిచేయాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ గజేందర్ పేర్కొన్నారు.